మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు చేసి దుల్కర్ కు తెలుగులో హ్యాట్రిక్ హిట్ ను అందించింది.
ఇక ఇటీవలే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీ లోనూ అదరగొడుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన నాటి నుంచి టాప్ లోనే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినిమాకు ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ చూసి హీరో దుల్కర్ ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పారు. లక్కీ భాస్కర్’ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
The greatest heist Baskhar ever pulled was stealing our hearts 🥰
— Netflix India South (@Netflix_INSouth) December 2, 2024
Watch Lucky Baskhar, now on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi! #LuckyBaskharOnNetflix pic.twitter.com/tuqxU8Se9U
Also Read : ఏపీలో ‘పుష్ప2’ టికెట్ ధరల పెంపు.. అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఇప్పుడు అదే ప్రేమను నెట్‌ఫ్లిక్స్‌లోనూ చూపుతున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలైంది. వాటిలో మలయాళం, తమిళం, తెలుగు భాషలకు నేనే డబ్బింగ్ చెప్పాను. కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి సమయం లేదు. ఈసారి చేసే సినిమాలకు 5 భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తా.
15 దేశాల్లో ట్రెండింగ్..
ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నాటినుంచి ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. కాగా ఈ సినిమా 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచి ఎన్టీఆర్ 'దేవర' ను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో 'లక్కీ భాస్కర్' మొదటి ప్లేస్ లో ఉండగా.. దేవర మూడో స్థానంలో ఉంది.
Also Read : 'పుష్ప2' లో ఆ సీన్ చూసి మైండ్ దొబ్బింది.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్