TS: వీడియోల ఘటనలో 12 మంది అరెస్ట్! మల్లారెడ్డి కాలేజ్ సీజ్?

మేడ్చల్ లోని సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వీడియోల వివాదం మరింత సీరియస్ అయింది. ఈ అంశంలో మహిళా కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గర్ల్స్ హాస్టల్ ఘటన కేసును సుమోటోగా తీసుకుంటున్నామని చెప్పింది. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

New Update
CMR College Girls Hostel Issue

CMR Engineering College

మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చినట్లు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటూ 5మంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల ఆరోపణలు నిజమని తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏసీపీ శ్రీనివాసరెడ్డి.

Also Read: అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన బుమ్రా..ఆఖరి టెస్ట్ మ్యాచ్ మొదలు

మహిళా కమిషన్ ఆదేశాలు...

మరోవైపు ఈ విషయంలో మహిళా కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గర్ల్స్ హాస్టల్ ఘటన కేసును సుమోటోగా తీసుకుంటున్నామని చెప్పింది. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది మహిళా కమిషన్. ఇక పోలీసులు కూడా ఈ విషయంపై చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ సిబ్బందిని విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి తీసుకున్న ఫోన్లలో వీడియోలను పరిశీలిస్తున్నారు. మరి కొంత మందిని కూడా ఈరోజు విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు.  హాస్టల్ గదిలోని ఒక బాత్రూం వద్ద కిటికీలో నుంచి ఒక అగంతకుడు తొంగి చూశాడని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే స్పాట్ కు చేరుకుని కిటికీ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించినట్లు చెప్పారు.  అలాగే హాస్టల్ వెంటిలేటర్ మీద కూడా వేలిముద్రలు కనిపించాయని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థినుల ఆరోపణల ప్రకారం, నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.  విద్యార్థినుల ఆరోపణలు నిజమైతే మల్లారెడ్డి కాలేజ్ సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Cricket: రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు–రవి శాస్త్రి

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు