OTT: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!

ఈ వారం సినీ ప్రియులను అలరించేందుకు థియేటర్, ఓటీటీలో పలు సినిమాలు, సీరీస్ లు రాబోతున్నాయి. అక్టోబర్ 18న శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్‌ 'ఖడ్గం' రీ రిలీజ్ తో పాటు.. ‘రివైండ్‌', 'సముద్రుడు', 'వీక్షణం', 'కలి', '1000 బేబీస్' చిత్రాలు సందడి చేయనున్నాయి.

New Update

This Week Ott Movies: దసరా సందర్భంగా పలు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక పండగ తర్వాత ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరికొన్ని సీరీస్ లు, సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు 

'ఖడ్గం' 

దేశభక్తి నేపథ్యంలో 2002 లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ 'ఖడ్గం'. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 18న ఈ మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. 

 'సముద్రుడు'

రమాకాంత్, అవంతిక, భాను శ్రీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సముద్రుడు'. మత్స్యకారుల జీవితాలను ప్రతిభింబిస్తు రూపొందిన ఈ చిత్రాన్ని నగేశ్‌ నారదాసి తెరకెక్కించారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. 

Also Read: ఏంటీ.. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది రతన్ టాటానా!

'వీక్షణం'

రామ్ కార్తీక్, క‌శ్వి ప్రధాన పాత్రలో నటించిన కామెడీ మిస్టరీ థ్రిల్లర్ 'వీక్షణం'. మ‌నోజ్ ప‌ల్లేటి తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

‘లవ్‌రెడ్డి’

స్మరన్‌రెడ్డి దర్శకత్వంలో అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ  ‘లవ్‌రెడ్డి’. ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ప్రేమకథను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 

Also Read:  కుక్క కోసం.. బ్రిటన్ రాజునే లెక్కచేయని టాటా! రూ.165 కోట్లతో డాగ్ హాస్పిటల్

‘రివైండ్‌’

సాయి రోనక్,   అమృత చౌదరి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ  ‘రివైండ్‌’. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రానికి  కళ్యాణ్‌ చక్రవర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అక్టోబరు 18న విడుదల కానుంది. 

ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్

డిస్నీ హాట్ స్టార్ 

1000 బేబీస్: అక్టోబరు 18
నెమిసిస్‌ (డచ్ సిరీస్) : అక్టోబరు 16
రైవల్స్‌ (ఇంగ్లీష్) : అక్టోబరు 18
రీతా సన్యాల్‌ : అక్టోబరు 14

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ది ప్రదీప్స్‌ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌:  అక్టోబరు 17

నెట్‌ఫ్లిక్స్‌: ది లింకన్‌ లాయర్‌ :  ( అక్టోబరు 17)

నెట్‌ఫ్లిక్స్‌:  ఫ్యాబులస్‌ లైవ్‌స్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వైవ్స్‌ సీజన్ 3  ( అక్టోబరు 18) 

ఈటీవీ విన్:  కలి ( అక్టోబర్ 17న) 

ఇది కూడా చదవండి: నాగ వంశీకి షాక్.. సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు