హైదరాబాద్‌‌లో యుద్ధానికి సిద్ధమవ్వండి.. ఈ ప్రాంతాలే టార్గెట్!

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ సిటీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలీ NFC ప్రాంతాల్లో సా. 4గంటలకు మాక్‌ డ్రిల్ చేయనున్నారు.

New Update
hyd Mock drills 123

పాకిస్తాన్, భారత్‌ల మధ్య హైటెన్షన్ నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే దేశ పౌరులు ఎలా నడుచుకోవాలనే అంశంపై బుధవారం(మే 7) మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 259 నగరాల్లో ఈ మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ సిటీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

Also read: Air India : విమానంలో టాయిలెట్ల తిప్పలు.. ఇండియాకు రావాల్సింది మధ్యలోనే!

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలీ NFC ప్రాంతాల్లో సా. 4గంటలకు మాక్‌ డ్రిల్ చేయనున్నారు. వైమానిక దాడులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకే ఈ మాక్‌ డ్రిల్.  వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు, విద్యార్థులతో సహా పౌరులకు అవసరమైన పౌర రక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం వంటివి ఉన్నాయి. శత్రువుల దాడి, అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 

(hyderabad | defence mock drills | cheerala-police-mock-drill | india pak border | india pak war | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు