Air India Flight: విమానంలో టాయిలెట్ల తిప్పలు.. ఇండియాకు రావాల్సింది మధ్యలోనే!

కెనడాలోని టొరంటో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం దారి మళ్లించారు. ఫ్లైట్‌లో టాయిలెట్ల డోర్స్ పనిచేయలేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ల్యాండ్ చేశారు. గత 2నెలల్లోనే ఇలా జరగడం ఇది రెండోసారి.

New Update
air india flight

Air India Flight

Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో ప్యాసింజర్లుకు చెప్పుకోలేని కష్టాలు వచ్చాయి. ఫ్లైట్ గాల్లో ఉండగా విమానంలోని మరుగుదొడ్ల డోర్స్ తెరుచుకోవడం లేదు. కెనడాలోని(Canada) టొరంటో(Toronto) నుంచి ఢిల్లీకి(Delhi) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు. ఫ్లైట్‌లో టాయిలెట్ల(Toilets) డోర్స్ మూసుకుపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానాన్ని జర్మనీలోని(Germany) ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించారు. ప్రస్తుతం ఫ్రాంక్‌ఫర్ట్‌లో టొరంటో-డెహికు నుంచి వచ్చిన విమానం మెయిన్‌టెన్స్‌లో ఉంది. గత 2 నెలల్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఇలాంటి సంఘటన రెండోది. సుదూర ప్రయాణలకు పాత ఫ్లైట్‌లను వాడితే అందులో ఫ్లంబింగ్ సమస్యలు వస్తున్నాయి.

Also Read: HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!

Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఎయిర్ ఇండియా ప్రతినిధి సాంకేతిక సమస్య వల్లే ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్(Air India Flight Emergency Landing) చేశామని తెలిపారు. విమానం రెండు గంటల్లోనే ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రయాణీకులు టాయిలెట్లలో చెత్త వేయడం వల్ల అవి స్ట్రక్ అయ్యాయట. పాలిథిన్ బ్యాగులు, గుడ్డలు, బట్టలు వంటి వస్తువులను టాయిలెట్లలో పడేయడం వల్లే టాయిలెట్లు మూసుకుపోయాయి నిరుపయోగంగా మారాయని ఎయిర్‌లైన్ తెలిపింది.

(air-india-flight | air india flight emergency landing | air-india-flights | flights-diverted | toilets | latest-telugu-news)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు