/rtv/media/media_files/2025/01/22/iU5ofSi7MJ1H7uMe7Z6g.jpg)
IT Raids In Hyderabad
హైదరాబాద్ లో వరుసగా మూడు రోజులు ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. నిన్న అర్ధరాత్రి వరకు తనిఖీలు జరిగాయని అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నామని ఐటీ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండు రోజులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అలాగే దిల్ రాజు మరో నిర్మాత బ్యాంకు లావాదేవీలను కూడా సుదీర్ఘంగా పరిశీలించినట్టు సమాచారం.
Also Read: Indore: మంచి చేశా అనుకున్నాడు కానీ ..అడ్డంగా బుక్కయ్యాడు
మూడు రోజులు...16 చోట్ల...
మొత్తం 55 మంది టీమ్ తో హైదరాబాద్ లో 16 ఛోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు, దర్శకులే టార్గెట్ గా తనిఖీలు చేశారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో సంస్థతో పాటు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థ సత్య రంగయ్య ఇంట్లో, ఆఫీసులోను మూడు రోజులు పాటు ఐటీ దాడులు నిర్వహించింది. మరొక ఫైనాన్సర్ నిర్మాత నెక్కింటి శ్రీధర్ ఇంటిలో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరుకు చెందిన ప్రతాపరెడ్డి ఇంట్లో రెండు రోజులుసోదాలు చేసారు. దిల్ రాజు భార్య ద్వారా వారి బ్యాంకు ఖాతాలను కూడా పరీక్షించారు. దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ ఉజాస్ విల్లాస్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. అలాగే రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి.., శిరీష్ ఇళ్లల్లోనూ ఐటీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, రవిశంకర్‌లతో పాటు సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
Also Read: USA: అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం