/rtv/media/media_files/2025/01/30/CSXdRdaYBCsAFwLhFaFl.jpg)
Shilpa Layout flyover
హైదరాబాద్ (Hyderabad) లోని వాహనదారులకు జీహెచ్ఎంసీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. గచ్చిబౌలి జంక్షన్ (Gachibowli Junction) లోని ఎస్‌ఆర్‌డిపి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా 2025 జనవరి 30 నుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. గురువారం నుంచి రాబోయే రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
Also Read : ఏపీలో దొంగల బిభత్సం ..షాపుల షట్టర్లు పగుల గొట్టి...
కనెక్టివిటీని మెరుగుపరచడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఈ ప్రాజెక్టును చేపట్టింది. గచ్చిబౌలిలోని పిల్లర్ నంబర్ 24 వద్ద వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగితే ప్రయాణికులు, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రద్దీని తగ్గించడానికి, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.
Also Read : Revanth Vs KCR: కేసీఆర్ పాలనే బాగుంది.. సొంత 'X' ఖాతా పోల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్!
Traffic Restrictions In Hyderabad
రూట్ 1: జడ్పీహెచ్ఎస్ యూ టర్న్ నుంచి వచ్చే వాహనాలను రోలింగ్హిల్స్ వద్ద శిల్పా ఫ్లైఓవర్ వద్ద మళ్లించబడతాయి. లేదా రాడిసన్ హోటల్, డీఎల్ఎఫ్, ఐఐఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి వైపు మళ్లిస్తారు
రూట్ 2: గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లే వాహనాలను డీఎల్ఎఫ్ రోడ్డు, రాడిసన్ హోటల్ ఎడమ మలుపు మీదుగా మళ్లిస్తారు.
Also Read : కోహ్లీ కోసం ఎగబడ్దారు.. అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట!
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జనవరి 29 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఈ మళ్లింపులను అమలు చేయనున్నారు. ప్రయాణికులు నిర్ణీత మార్గాలను అనుసరించాలని తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నందున ప్రజలు సహకరించాలని కోరారు.
Also Read : AP Govt : ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్.. తొలి విడతలో ఏ శాఖలంటే!