Viral Video: ''కజ్రా రే" పాటకు కూతురితో ఐశ్వర్య- అభిషేక్ ఎలా స్టెప్పులేశారో చూడండి .. వీడియో వైరల్

బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య - అభిషేక్ బచ్చన్ మరో సారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. తాజాగా ముంబైలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఈ జంట.. అక్కడ సరదాగా డాన్స్ వేశారు. సింగర్ రాహుల్ వైద్య ''కజ్రా రే" పాట పాడుతుండగా కూతురు ఆరాధ్యతో కలిసి స్టెప్పులేశారు.

New Update
Abhishek- Aishwarya Bachchan dance video viral

Abhishek- Aishwarya Bachchan dance video viral

Viral Video:   బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన  ఓ వివాహ వేడుకకు అభిషేక్- ఐశ్వర్య జంట తమ కూతురు ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో సింగర్ రాహుల్ వైద్య  "కజ్రా రే" పాట పాడుతుండగా అభిషేక్ ఫ్యామిలీ సరదాగా డాన్స్ వేస్తూ కనిపించారు. ఐశ్వర్య డాన్స్ వేస్తుండగా.. అభిషేక్, ఆరాధ్య చప్పట్లు కొడుతూ మధురమైన సమయాన్ని ఆస్వాదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

Also Read: Hero Vishal: అనారోగ్యం తర్వాత.. తొలిసారి విజయ్ సేతుపతితో విశాల్.. వైరలవుతున్న ట్వీట్

18వ వెడ్డింగ్ యానివర్సరీ

ఈ  వీడియోలో అభిషేక్ ఐవరీ కలర్ షెర్వానీ ధరించి స్టైలిష్‌గా కనిపించగా, ఐశ్వర్యా అనార్కలీ డ్రెస్ ధరించారు. కూతురు ఆరాధ్య అమ్మానాన్నకు మ్యాచింగ్ గా బ్యూటిఫుల్ లెహంగా వేసుకుంది. ఇదిలా ఉంటే.. గతనెల ఐశ్వర్య - అభిషేక్ తమ 18వ వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య తన సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ షేర్ చేశారు. 

విడాకుల రూమర్స్.. 

అయితే కొన్ని రోజుల క్రితం అభిషేక్- ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత వారిద్దరూ పలు ఈవెంట్లకు, ఫంక్షన్లకు కలిసి హాజరవడంతో ఈ రూమర్లకు చెక్ పడింది. అంతేకాదు ఈ రూమర్ల తర్వాత ఐశ్వర్య- అభిషేక్ తమ కూతురు ఆరాధ్య బర్త్ డేను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. గత డిసెంబర్ లో ఓ స్టార్ స్టడెడ్ ఈవెంట్ కి కలిసి హాజరయ్యారు. 

telugu-news | cinema-news | aishwarya- abhishek Bachchan

Also Read: Surekha Vani Daughter: ఆస్పత్రిపాలైన సురేఖ వాణి కూతురు... సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు