Pista House Raids : వామ్మో.. పిస్తా హౌస్‌ లో బిర్యానీ తింటే ఖతమే.. ఎలుకలు, బొద్దింకలతో!

హైదరాబాద్ లోని పలు  పిస్తా హౌస్‌ రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల 2025 ఆగస్టు 12వ తేదీన తనిఖీలు చేపట్టారు. మొత్తం 25 పిస్తా హౌస్‌ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి అధికారులు 23 చోట్ల శాంపిల్స్‌ సేకరించారు.

New Update
pista hpuse

హైదరాబాద్(Hyderabad) లోని పలు  పిస్తా హౌస్‌ రెస్టారెంట్ల(Pista House Restaurants) లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల 2025 ఆగస్టు 12వ తేదీన తనిఖీలు చేపట్టారు. మొత్తం 25 పిస్తా హౌస్‌ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి అధికారులు 23 చోట్ల శాంపిల్స్‌ సేకరించారు. తనిఖీల అనంతరం నిబంధనలు పాటించట్లేదని తేల్చిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తేల్చారు. కిచెన్ పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వంట గదిలో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు తిరుగుతున్నట్లు నిర్ధారించారు. నాన్-వెజ్ వంటకాల్లో నాణ్యతలేని, నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది.

Also Read :  హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన

మొత్తం 25 పిస్తా హౌస్ బ్రాంచ్‌లలో

ఆహారాన్ని నిల్వ చేసే ఫ్రిజ్‌లు తుప్పు పట్టి ఉండటంతో పాటు, వాటిలో నిల్వ చేసిన నాన్-వెజ్ పదార్థాలను సరిగా భద్రపరచడం లేదని అధికారులు పేర్కొన్నారు. కొన్ని బ్రాంచ్‌లలో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌లకు సంబంధించిన గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలలో మొత్తం 25 పిస్తా హౌస్ బ్రాంచ్‌లలో అధికారులు తనిఖీలు చేసి, వాటిలో 23 చోట్ల ఆహార నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఈ లోపాలపై పిస్తా హౌస్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. కాగా ఇటీవల కాలంలో నగరంలోని పలు రెస్టారెంట్, హోటల్స్ తనిఖీ చేసిన అధికారులు.. నిర్వాహకులు శుభ్రతను పాటించకుండా, కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి, చికెన్, తదితర కలుషిత ఆహారాన్ని కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు.

Also Read :  నిజం సింహం లాంటిది.. KTR లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే

Advertisment
తాజా కథనాలు