/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
HYD Rain Alert: ఈరోజు సైబరాబాద్ ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలకు సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి ఈరోజు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతని పాటిస్తే మేలని సూచించారు.
Also Read: Pawan Kalyan: ప్లాపుల్లో నా కోసం నిలబడిన మిత్రుడు త్రివిక్రమ్.. పవన్ ఎమోషనల్ కామెంట్స్!
వర్క్ ఫ్రమ్ హోమ్
అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం కలుగుతుంది. అందుకే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు విభాగం తమ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ పెట్టింది. "ఈ రోజు సైబరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దయచేసి ట్రాఫిక్ అంతరాయాలను నివారించడానికి ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపికను పరిగణించండి. మీ సహకారం మాకు విలువైనది" అని కోరింది.
Also Read: Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ ఆష్ బిగ్ అప్డేట్.. ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా..!
🚨Alert 🚨 pic.twitter.com/BdwGyAdpOL
— Cyberabad Police (@cyberabadpolice) July 22, 2025
ఇలా చేయడం ద్వారా ఉద్యోగులు సురక్షితంగా ఉండటంతో పాటు, ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని పోలీసులు ఆశిస్తున్నారు. అలాగే భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కూడా ఈ సూచనలు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయం.