BIG BREAKING: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత!

సీపీఐ అగ్ర నాయకులు, మాజీ జాతీయ కార్మాయదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

New Update
CPI

CPI senior Leader Suravaram Sudhakar Reddy

సీపీఐ అగ్ర నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

సీపీఐ మాజీ కార్యదర్శి..

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున సురవరం సుధాకర్ రెడ్డి 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈయన మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించారు. ఈయన తండ్రి  వెంకట్రామిరెడ్డి..స్వాతంత్ర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్‌రెడ్డి కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టాపొందారు. 1974లో విజయలక్ష్మిని వివాహం చేసున్నారు. వారికి ఇద్దరు కుమారులు.

సురవరం సుధాకర రెడ్డి సీపీఐలో చాలా ఏళ్ళు చురుగ్గా పని చేశారు.  2012 నుంచి 2019వరకు ఆయన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు.1998-99లలో మానవ వనరుల అభివృద్ధి కమిటీ ఔషధ ధర నియంత్రణ దాని ఉప కమిటీ సభ్యలుగా కూడా ఉన్నారు. దాంతో పాటూ ప్రభుత్వ సలహా కార్యవర్గ సమితి, ఆర్థిక మంత్రిత్వ శాఖగా పనిచేశారు సురవరం. 

Also Read: TIK TOK: చైనాతో దోస్తీ..ఐదేళ్ల తర్వాత టిక్ టాక్ భారత్ లోకి!

Advertisment
తాజా కథనాలు