TIK TOK: చైనాతో దోస్తీ..ఐదేళ్ల తర్వాత టిక్ టాక్ భారత్ లోకి!

నిన్నటి వరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గమనేది..కానీ ట్రంప్ పుణ్యమాని దోస్తులుగా మారిపోయాయి భారత్, చైనాలు. ఈ ప్రభావంతో ఐదేళ్ళ క్రితం బ్యాన్ చేసిన టిక్ టాక్ ఇప్పుడు భారత వెబ్ సైట్ లలో దర్శనమిస్తోంది. అయితే ప్లే స్టోర్స్ లో మాత్రం ఇది కనిపించడంలేదు.

New Update
TIk Tok

TIK TOK

ఓడలు బళ్ళు...బళ్ళు ఓడలు అవుతున్నాయి. మిత్రులు శత్రువులు గానూ శత్రువులు మిత్రులు గానూ మారుతున్నారు. నిన్న, మొన్నటి వరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే భారత్, చైనాలు ఇప్పుడు దోస్త్ లు గా మారిపోయాయి. ఇరు దేశాలు ఒకరితో ఒకరు తిరిగి వాణిజ్యాన్ని ప్రారంభించాలని..స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో చైనా వస్తువులు భారత్ లోకి...మన మేక్ ఇన్ ఇండియా వస్తువులు చైనాలోకి ప్రవేశించనున్నాయి. దీని ఆద్యంగా చైనా టెక్ టాక్ ఐదేళ్ల తర్వాత భారత్ లో మళ్ళీ అందుబాటులోకి రాబోతోందని చెబుతున్నారు. జాతీయ మీడియాలో దీనికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. 

2020 నుంచి బ్యాన్...

ఐదేళ్ల క్రితం 2020లో భారత్, చైనా సరిహద్దుల్లో గల్వాన్ దగ్గర బీకర ఘర్షణ జరిగింది. ఈ ఉద్రిక్తతల కారణంగా చైనాకు చెందిన టెక్నాలజీ, వీడియో ప్లాట్ ఫామ్ లను భారత్ బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సౌర్వభౌమత్వానికి భంగం కలుగుతోందన్న కారణంతో టిక్‌టాక్‌, హెలో, పబ్‌జీ, షేరిట్‌, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, క్లాష్ ఆఫ్‌ కింగ్స్‌ లాంటి యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.  2020 జూన్‌లో 59 యాప్‌లు, సెప్టెంబర్‌లో మరో 118 చైనీస్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అంతేకాదు చాలా చైనా వస్తులుపై కూడా బ్యాన్ విధించింది. మేక్ ఇన్ ఇండియా వస్తువులు వాడండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. దీంతో పబ్జీల్లాంటి వాటిని పెద్దగా అదుపు చేయలేకపోయినా..టెక్ టాక్ బ్యాన్ మాత్రం స్ట్రిక్ట్ గా అమలు అయింది. అప్పట్లో దీనికి బాగా అలవాటు పడ్డ చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే ఇన్ స్టా గ్రామ్ అలవాటు పడడంతో టెక్ టాక్ ను మర్చిపోయారు. అయితే ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ టెక్ టాక్ భారతీయులకు అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. ప్లే స్టోర్లలో ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ వెబ్ సైట్ లో మాత్రం ఓపెన్ అవుతోందని చెబుతున్నారు. 

అంతా ట్రంప్ పుణ్యం..

అమెరికా సుంకాల దెబ్బకు భారత్, చైనాలు చేతులు కలిపాయి. భారత్ పై విధించిన అదనపు సుంకాలకు వ్యతిరేకంగా రష్యా, చైనాలు మన దేశంతో మరింత వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాయి. మూడు దేశాలు కలిపి అమెరికాను గట్టిగా ఎదుర్కోవాలని తీర్మానించాయి.  భారత వస్తువులను రెండు దేశాలకు ఎగుమతి చేసేలా ఒప్పందాలు చేసుకుంటోంది. దీనికి రష్యా, చైనాలు కూడా అంగీకారం తెలిపాయని తెలుస్తోంది. ట్రంప్ ఎంత సుంకాలు పెంచినా రష్యా నుంచి భారత్ కు చమురు ఎగుమతి అవుతుందని ఆ దేశ  ఉప ప్రధాని డెనిస్‌ స్పష్టం చేశారు. దాంతో పాటూ విద్యుదుత్పత్తి, ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గును కూడా రవాణా చేస్తామన్నారు. అలాగే భారత్ లో తయారయ్యే వస్తువులను దిగుమతి చేసుకుంటామని రష్యా ఉప ప్రధాని డెనిస్ స్పష్టం చేశారు. అలాగే  చైనా కూడా ఇదే మద్దతును ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా వస్తువులను తమ మార్కెట్ లోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. దాంతో పాటూ నేపాల్ సరిహద్దు లిపులేఖ్ గుండా వ్యాపారం పునరుద్ధరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

Also Read: PM Modi: క్రిమినల్స్ ఉండాల్సింది జైల్లో..పదవుల్లో కాదు..ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు