Hyderabad:  గచ్చిబౌలీలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో ఐదంతస్తుల భవన ఒకటి సడెన్‌గా పక్కకు ఒరిగిపోయింది. సమాచారం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు..వంటనే సమీప భవనాల్లో ఉంటున్న వారిని, ఒరిగిన భవనంలో ఉంటున్న వారికి ఖాళీ చేయించారు.

author-image
By Manogna alamuru
New Update
building

Building In gachhibowli: 

ఒకదాని పక్కనే ఒకటి అస్సలు గ్యాప్ లేకుండా భవంతులు నిర్మిస్తే ఎప్పటికైనా ప్రమాదమే. ఈ విషయమే నిన్న హైదరాబాద్ గచ్చిబౌలీలో నిరూపితమైంది. ఇక్కడి సిద్ధ్‌ నగర్‌‌లో చాలా పెద్ద ప్రమాదం తప్పింది.  కొండాపూర్‌ డివిజన్‌ సిద్దిఖ్‌నగర్‌లో ఐదంతస్తుల బిల్డింగ్ రాత్రి ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో కొంతసేపు  పాటూ ఏమయిందో తెలియక అందులో నివాసముంటున్నవారితో పాటు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

భవనం పక్కనే మరో బిల్డింగ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాంట్లో సెల్లార్‌ కోసం గొయ్యి తవ్వారు. దీని కారణంగా.. ఆ వైపునకు పక్కనున్న భవనం పిల్లర్లు కుంగాయి. దీంతో బిల్డింగ్ మొత్తం పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఏ క్షణంలో భవనం కూలుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా?టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

ఈ సంఘటనకు సంబంధించి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి స్పందించారు. ఏ బిల్డింగ్ నిర్మాణం కారణంగా ఈ ఘటన జరిగిందో...దాని యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తర్వాత నిపుణుల ద్వారా ఘటనా స్థలంలోని భవనాన్ని పరిశీలించాక వారి సూచనల మేరకు చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే భవనం మొత్తాన్ని కూల్చివేస్తామని చెప్పారు. స్థానికంగా భవనాల నిర్మాణానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఉపేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఘటనాస్థలానికి పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లను ఖాళీ చేయించారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా పవర్‌‌ను నిలిపేశారు.

Also Read: AP:తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

Also Read: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం... ఆ రెండు రోజులు వానలే వానలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు