/rtv/media/media_files/2025/07/20/sri-ganesh-2025-07-20-22-35-57.jpg)
MLA Sri Ganesh
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి చేశారు. తార్నాక లోని ఆర్టీసీ హాస్పటల్ దగ్గరలో ఓ వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యేపై దాడి చేసి పరారయ్యారు. అడ్డుకోబోయిన గన్ మెన్ ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అద్దాలు దించాలంటూ కారును వెంబడించారు. మాణికేశ్వర్‌నగర్‌లో ఫలహారం బండి ఊరేగిస్తుండగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తప్పించుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ తనపై జరిగిన దాడిపై కంప్లైంట్ ఇచ్చారు.