నాలుగో టెస్ట్ కోసం కోహ్లీ మెల్ బోర్న్ చేరుకున్నాడు. ఈ క్రమంలో ఈ క్రమంలో తీవ్ర పదజాలంతో కోహ్లీపై ఆస్ట్రేలియాకు చెందిన మీడియా హెడ్‌లైన్‌లు పెడుతూ...అనవసరంగా నోటి దురుసును బయటపెట్టుకుంటోంది. అసలేమైంది.. రెండు రోజల క్రితం విరాట్కోహ్లీ మెల్‌బోర్స్ చేరుకున్నాడు. అతను ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా ఆస్ట్రేలియా మీడియాకు చెందిన ఒక మహిళ విరాట్ అనుమతి లేకుండా అతని పిల్లల ఫోటోలను తీశాడు. దీనిపై కోహ్లీ అక్కడే కోపం వ్యక్తం చేశాడు. ఎంత సెలబ్రిటీలం అయినా కూడా మాకు ప్రైవసీ ఉంటుంది కదా అంటూ ఆ రిపోర్టర్ కు గట్టిగా చెప్పాడు దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఇదే విషంపై ఆసీస్ మీడియా అక్కసు వెళ్ళగక్కుకుంటోంది. నైన్ స్పోర్ట్స్ రిపోర్టర్ టోనీ జోన్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ..విరాట్ కోహ్లీ మీ ధోరణి సరిగ్గా లేదు. అలా ప్రవర్తించడం సరికాదు. సదరు మహిళా జర్నలిస్ట్ ఒక కెమెరామెన్‌తో ఉన్నారు. రోజూ నిర్వర్తించే బాధ్యతల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. అక్కడికి రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఎవరైనా సరే గుర్తింపు కలిగిన వారు వస్తుంటారు. మీరు అక్కడికి రావడంతో కెమెరాలు మీవైపు తిప్పారు. ఎంత మీరు గుర్తింపు కలిగిన బ్యాటర్ అయితే మాత్రం ఇలా ప్రవర్తిస్తారా అంటూ కామెంట్ చేశారు. నిజానికి విరాట్ చేసింది ఏమీ తప్పు కాదు. తని అనుమతి లేకుండా కుటుంబ వ్యక్తులు ఫోటోలు తీయడం వాళ్ళ తప్పు. అదేదో క్యాజువల్‌గా చేసింది కాదు. కానీ ఆస్ట్రేలియా మీడియా మాత్రం తమ వారినే వెనకేసుకుని వచ్చింది. అసలు ఆస్ట్రేలియా మీడియాకు భారత క్రికెటర్లపై ఏదో ఒకటి రాయడం లేదా కామెంట్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఎన్నో ఏళ్ళుగా ఇది సాగుతూనే ఉంది. అందులోనూ విరాట్ కోహ్లీ గురించి అయితే ఇంకాను. ఇప్పుడు జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు కూడా కోహ్లీని తక్కువ చేస్తూ కథనాలు వెలువడ్డాయి. సూపర్ స్టార్ అని చెబుతూనే అతనిని తక్కువ చేస్తూ రాశాయి. మెల్‌బోర్న్‌లో విరాట్‌కు మంచి రికార్డు ఉంది. అయితే ప్రస్తుతం ఈ సీరీస్ లో కోహ్లీ ఏమంతగా ఆడటం లేదు. మొత్తం టీమే సరిగ్గా పెర్ఫామ్ చేయడం లేదు. ఇప్పుడు మెల్‌బోర్న్ టోర్నీలో కనుక ఆడితే.. ఈమ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను కోల్పోయే అవకాశం లేకుండా ఉండటంతోపాటు ఆధిక్యంలోకి దూసుకెళ్తుంది. Also Read: Chennai: ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్..కార్లు,రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు