/rtv/media/media_files/2025/01/22/gcRVjwnY8qcp8bWoTDDn.jpg)
mother kill Photograph: (mother kill)
భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ తల్లి ఇద్దరు పిల్లల ప్రాణం తీసింది. భర్తతో వివాదమై తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. తర్వాత ఆమె కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా భర్త అడ్డుకుని కాపాడాడు. కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ డయ్యూలో ఈ దుర్ఘటన జరిగింది. జనవరి 20న రాత్రివేళ డామన్ జిల్లా నాని డామన్ ప్రాంతంలోని దల్వాడ ప్రాంతంలో నివసిస్తున్న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంలో సీమా యాదవ్, మూడేళ్ల లోపు వయస్సున్న తన ఇద్దరు కుమారులను బిల్డింగ్ నాలుగో అంతస్తులోని అపార్ట్‌మెంట్ బాల్కానీ నుంచి కిందకు విసిరేసింది.
ఇది కూడా చదవండి :బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్
సీమా యాదవ్ కూడా పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే భర్త ఆమెను పట్టుకుని వెనక్కిలాగాడు. ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పిల్లలను చంపిన తల్లి సీమాను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.