Challan: వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే!

TG: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్ ‌‌ లేకుండా డ్రైవ్ ‌‌ చేస్తే ఇక నుంచి రూ.200, రాంగ్ సైడ్ ‌‌ డ్రైవింగ్ ‌‌ చేస్తే రూ.2వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు.

Pending Challans: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలు మాత్రమే!
New Update

Traffic Challans : ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. కాగా నిబంధలను పాటించకుండా ఉండడం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని పోలీసులు తెలిపారు. వీటన్నికి అదుపు చేసేందుకు రూల్స్ ని, ఫైన్స్ ని స్ట్రిక్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read :  ఫ్రిజ్‌లో ఈ సీక్రెట్‌ బటన్‌ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం

హెల్మెట్ లేకపోతే రూ.235 ఫైన్ .. !

హెల్మెట్ లేకుండా టూ వీలర్ పై ప్రయాణిస్తున్న వారి షాక్ ఇచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనంపై ప్రయాణం చేస్తే రూ.200 ఫైన్ విధించనున్నారు. మొత్తం సర్వీస్ ఛార్జీలతో కలిపి రూ.235 ముక్కు పిండి వసూలు చేయనున్నారు. రోజు రోజుకు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం.. అలాగే సగానికి పైగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో హెల్మెట్ లేని వల్లే ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉందని పోలీసులు చెప్పారు. 

Also Read :  దూసుకుపోతున్న ట్రంప్‌.. 17 రాష్ట్రాల్లో ..188 ఎలక్ట్రోరల్‌ ఓట్లతో!

అయితే.. వీటిని నియంత్రించేందుకే ట్రాఫిక్ చలానాను పెంచినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గతంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.100 ఫైన్ వేసే వారు. సర్వీస్ ఛార్జీలు అదనంగా వసూలు చేసే వారు. రూ.35 సర్వీస్ ఛార్జితో కలిపి రూ.135 చలానా విధించే వారు. తాజాగా ఏకంగా రూ.100 పెంచి వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు.

Also Read :  ప్రముఖ నటి అరెస్టుకు రంగం సిద్ధం..!

రాంగ్ రూట్ @2000 ఫైన్.. !

రాంగ్ సైడ్ ‌‌ డ్రైవింగ్ ‌‌ చేస్తే రూ.2వేలు జరిమానా విధించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. జరిమానాతోపాటు రూ.35 సర్వీస్​చార్జ్​వసూలు చేయనున్నారు. స్పాట్ చలాన్స్ ‌‌లో మాత్రం సర్వీస్​చార్జ్​ మినహాయించనున్నారు. గతంలో రాంగ్ రూట్ లో వస్తే రూ.1000 ఫైన్ విధించే వారు. అలాగే కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా చలాన్ల పెంచడంపై కొందరి నుంచి వ్యతిరేకత వచ్చినా..  మరికొంత మంది ఇది మంచి నిర్ణయం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ ఆకలి అవుతుందా?

#hyderabad #traffic-police #challans
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe