US: దూసుకుపోతున్న ట్రంప్‌.. 17 రాష్ట్రాల్లో ..188 ఎలక్ట్రోరల్‌ ఓట్లతో!

అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్‌ కి 188 ఎలక్టోరల్‌ సీట్లు లభించగా...కమలాకి 99 ఎలక్టోరల్‌ సీట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో ట్రంప్‌ విజయం సాధించగా..కమలా 7 రాష్ట్రాల్లో విజయం అందుకున్నారు.

New Update
trump kamala

US Elections 2024 : అమెరికా ఎన్నికల తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ కొంచెం వెనుకబడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయానికి ఓక్లహోమా, మిస్సోరి, ఇండియానా, కెంటకీ, టెన్నిసీ, అలబామా, ఫ్లోరిడా, వెస్ట్‌ వర్జీనియా, దక్షిణ కరోలినా, అర్కాన్సస్‌ ల్లో రిపబ్లికన్లు ముందంజలో ఉన్నారు. 

Also Read:  9 రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్న ట్రంప్‌!

ఇప్పటి వరకు ట్రంప్‌ కి 188 ఎలక్టోరల్‌ సీట్లు లభించగా...కమలాకి 99 ఎలక్టోరల్‌ సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో కమలా విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.

haha

Also Read:  Big Breaking: AP మెగా డీఎస్సీ వాయిదా..!

అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్‌ బర్గ్‌, ఫిలడెల్ఫియాలో ఆమె ముందుంజలో ఉన్నారు. దీంతో ఫలితాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

Also Read: US Elections: అమెరికా ఎన్నికలు..ఆ రెండు రాష్ట్రాల్లో ట్రంప్‌ దే విజయం!

నార్త్‌ డకోటా, వ్యోమింగ్‌,సౌత్‌ డకోటా,ఇండియానా, నెబ్రాస్కా, ఓహియో, కెంటుకీ, వెస్ట్‌ వర్జీనియా, టెన్నీసీ, అర్కాన్సాస్‌, ఓక్లాహమా, మిస్సిసిపీ, లూసియానా, టెక్సాస్‌, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా వంటి 17 రాష్ట్రాల్లో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. కమలా న్యూయార్క్‌, వెర్మాంట్‌, మాసుచూసట్,కనెక్టికటి, న్యూ జెర్సీ, మేరీల్యాండ్‌, ఇల్లినోయిస్‌  రాష్ట్రాల్లో విజయం సాధించారు.

Also Read:  US Elections: ఓటేసిన అమెరికా...అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్‌!

బెదిరింపులు..

అక్కడక్కడ సాంకేతిక సమస్యలు, బ్యాలెట్‌ ప్రింటింగ్‌లో లోపాలు, వాతావరణ వల్ల సమస్యలు, బూటకపు బెదిరింపులు వంటి ఘటనలు ఎదురైనప్పటికీ..ఎక్కువ సేపు నిలబడలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. పెన్సిల్వేనియాలో రిపబ్లికన్‌ పోలింగ్‌ పర్యవేక్షకులను కొన్ని ఎన్నికల కేంద్రాల్లో అనుమతించలేదనే వార్తలు వచ్చాయి. 

అయితే సమస్య వెంటనే  పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇకడ కొన్ని బ్యాలెట్ యంత్రాలలో కూడా సమస్యలు వచ్చాయి. దాంతో ఇక్కడ పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించారు. ఇల్లినాయిస్‌లో ఛాంపియన్‌ కౌంటీలో సాంకేతిక లోపాలు, కెంటకీలోని లూయీవిల్‌లో ఈ-పోల్‌బుక్‌లతో సమస్యల వలన పోలంగ్ ప్రక్రియ్ కాస్త ఆలస్యమైంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు