BIG BREAKING: పాడి కౌశిక్ రెడ్డికి మరో షాకిచ్చిన పోలీసులు!

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. రేపు విచారణకు రావాలని మాసబ్‌ట్యాంక్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే.. కరీంనగర్ కోర్టుకు తాను హాజరుకావాల్సి ఉందని.. 17న విచారణకు వస్తానని కౌశిక్ రెడ్డి పోలీసులకు తెలిపారు.

New Update
Padi Kushik Reddy

Padi Kushik Reddy

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. రేపు విచారణకు రావాలని మాసబ్‌ట్యాంక్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను కరీంనగర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని పోలీసులకు ఎమ్మెల్యే తెలిపారు. ఈనెల 17న విచారణకు వస్తాననన్నారు. గతంలో బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ డ్యూటీని అడ్డుకోవడం కాకుండా.. బెదిరింపులకు దిగాడని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు సీఐ రాఘవేందర్‌ ఫిర్యాదుతో పోలీసులు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌ను డీసీపీ విజయ్‌కుమార్‌ నియమించారు. దీంతో విచారణ చేపట్టన పరుశురామ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. 
ఇది కూడా చదవండి:BREAKING NEWS : కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

ఇటీవల అరెస్ట్.. వెంటనే బెయిల్..

ఇదిలా ఉంటే.. ఆదివారం కరీంనగర్ కలక్టరేట్ లో పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో BNS యాక్ట్ లోని 115(2), 121(1), 126(2), 221, 292, 351(2), 352 సెక్షన్ల కింద కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్ రెండో అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌషిక్ రెడ్టిని పొలీసులు ప్రవేశపెట్టగా.. బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన విడుదలయ్యారు. 
ఇది కూడా చదవండి:Cigarette: సిగరెట్ తాగే అలవాటు ఉందా..? అయితే ఈ వార్త మీ కోసమే

అయితే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనపై రౌడి షీట్ తెరుస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. కౌశిక్ రెడ్డి మాత్రం ప్రజల సమస్య కోసం పోరాడుతున్నందుకే తనపై కేసులు నమోదు చేస్తున్నారని చెబుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానంటున్నారు.

Advertisment
తాజా కథనాలు