Hyd crime news
TG Crime: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో మానవత్వాన్ని మరిచిపోయిన ఘోర ఘటన చోటు చేసుకుంది. అందంగా ఉందన్న కోణంలో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మూడు సంవత్సరాల క్రితం వివాహం అయిన జాస్మిన్, రాజశేఖర్‌తో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ ఆ సంబంధం ఆమెకు నరకంగా మారింది. వివాహం అనంతరం మానసికంగా, శారీరకంగా వేధింపులు ఎక్కువయ్యాయి. హింసించే వ్యక్తిగా మారిన రాజశేఖర్, తన భార్య జాస్మిన్ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.
హత్య చేసి ఆత్మహత్యగా..
ఇటీవల జరిగిన ఈ ఘటనలో రాజశేఖర్ మొదట జాస్మిన్‌ను కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం వైర్‌తో ఉరివేసి హత్య చేశాడు. తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి జాస్మిన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని అబద్ధంగా చెప్పాడు. అయితే జాస్మిన్ శవాన్ని చూసిన తల్లిదండ్రులు ఆమె ఒంటిపై గల గాయాలపై అనుమానం వ్యక్తం చేసి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: ఈ ముల్లు మొక్కలో అనేక ఔషధ గుణాలు తెలుసా..?
రాజశేఖర్ గతంలో కూడా జాస్మిన్‌ను వేధించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో కూడా అప్పట్లో ఆమె ఫిర్యాదు చేసిన కేసు ఉంది. అయినప్పటికీ.. తగిన చర్యలు తీసుకోకపోవడం, సమస్యను ఊహించకుండా వదిలేయడం వలన ఈ రోజు ఇంత విషాదం జరిగినట్లు తెలుస్తోంది.
(ts-crime | ts-crime-news | crime news | latest-news | telugu-news)
ఇది కూడా చదవండి: ఆహారంపై నిమ్మరసం ఎందుకు వెసుకుంటారో తెలుసా..? ఆరోగ్య రహస్యం ఇదే