Hyderabad:
గుండెపోటుకు వయసుతో సంబంధం లేదని మరోసారి తెలిసింది. కార్తీక మాసం సందర్భంగా గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న ఆ యువకున్ని మృత్యువు గుండెపోటు రూపంలో ఆలయం లోపలే బలితీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం ఉదయం జరిగింది.
Also Read: AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..!
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తీక మాసం కావడంతో స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఇదే రీతిలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ యువకుడు, దురదృష్టవశాత్తు ప్రదక్షిణలు చేస్తూనే, గుండెపోటుకు గురై చనిపోయాడు.
Also Read: Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనే..!
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విష్ణువర్ధన్ (31) అనే యువకుడు రోజువారి మాదిరిగానే ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఉదయం కూడ వచ్చాడు. విష్ణువర్ధన్ ప్రదక్షిణలు చేయడం ప్రారంభిన కాసేపటికే విష్ణువర్ధన్ గుండెపోటుకు గురయ్యాడు. హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడంతో, స్థానిక భక్తులు వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.
Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు
అయితే వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి, విష్ణువర్ధన్ అప్పటికే తనువు చనిపోయినట్లు చెప్పారు. విష్ణువర్ధన్ ప్రదక్షిణలు చేస్తూ సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అయితే ఆలయానికి వెళ్లిన కుమారుడు ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతూ..అతని ఫోన్ కి చేయగా..ఆసుపత్రిలో ఉన్న వారు ఈ విషయాన్ని వారికి తెలియజేశారు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
విష్ణు మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. విష్ణుని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్వామి వారి దర్శనానికి వెళ్లడని, కానీ ఇలా విగత జీవిగా వస్తాడని ఊహించలేక పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన వయసుకుని హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటని వారు బోరున విలపిస్తున్నారు. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటూ ఇలా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. విష్ణు మృత దేహంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.