/rtv/media/media_files/2025/09/06/hyderabad-ganesh-nimajjanam-2025-09-06-08-10-31.jpg)
Hyderabad Ganesh Nimajjanam
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నిమజ్జనం సందర్భంగా జరిగే శోభాయాత్రకు భారీగా భక్తులు రానున్నారు. దీంతో ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, లిబర్టీ, పంజాగుట్టా వంటి ప్రధాన ఏరియాల్లో భారీ రద్దీ ఏర్పడకుండా ఏర్పాట్లు చేశారు. బడా గణేష్ శోభాయాత్రను వీక్షించడానికి ఎందరో భక్తులు భారీగా తరలి వస్తుంటారు. కొందరు ప్రజా రవాణా ఉపయోగించుకోగా.. మరికొందరు సొంత వాహనాలను ఉపయోగించుకుంటారు.
సాఫీగా నిమజ్జనం సాగేందుకు..
నిమజ్జన ఊరేగింపు సాఫీగా సాగేందుకు భక్తులు ప్రజా రవాణా ఉపయోగించాలని అధికారులు చెబుతున్నారు. సొంత వాహనాలను ఈ రోజు ఉపయోగించవద్దని హెచ్చరిస్తున్నారు. సొంత వాహనాలు వల్ల అధికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు అందరూ ప్రజా రవాణా అయిన ఆర్టీసీ బస్సులు, మెట్రో వంటివి వినియోగించుకోవాలని సూచించారు.
నిమజ్జనానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్‌టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లో వాహనాలను పూర్తిగా నిషేధించారు. అలాగే, లిబర్టీ, పంజాగుట్టా, రాణిగంజ్, ట్యాంక్ బండ్ వంటి ప్రధాన జంక్షన్‌లను నివారించాలని పోలీసులు సూచించారు. ఈ పార్కింగ్ స్థలాలు నిమజ్జన ప్రాంతాలకు కాస్త దూరంలో ఉండేలా ప్లాన్ చేశారు. పార్కింగ్ కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
హుస్సేన్ సాగర్ దగ్గరికి నిమజ్జనం చేయడానికి వచ్చే భక్తులు వారి వెహికల్స్‌ను ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్, సంజీవయ్య పార్క్, ప్యారడైజ్ ఏరియాలో పార్క్ చేయవచ్చు. అదే పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వారు పంజాగుట్ట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేయవచ్చు. హైటెక్ సిటీ నుంచి వచ్చే వాహనాలు వారు శిల్పకళా వేదిక, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద పార్కింగ్ చేసుకోవచ్చు. ఖైరతాబాద్ వద్ద ఉన్నవారు బల్కంపేట దేవస్థానం ప్రాంగణం సమీపంలోని పాఠశాల మైదానంలో పార్కింగ్ చేసుకోవచ్చు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూదని ఉద్దేశంతో పోలీసులు ఈ ఏరియాల్లో పార్కింగ్‌కు అవకాశం ఇచ్చారు. భక్తులు అందరూ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!