/rtv/media/media_files/2025/06/30/hyderabad-dilsukh-nagar-mobiles-stolen-from-big-c-showroom-2025-06-30-18-22-25.jpg)
Hyderabad Dilsukh Nagar Mobiles stolen from Big C showroom
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు డబ్బులు సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్లాన్ బెడిసికొట్టి కటకటాలపాలవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా మొబైల్ షోరూంకి కన్నం వేసి లక్షల విలువైన ఫోన్లను దొచేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
బిగ్ సి షోరూంలో చోరీ
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లో భారీ దొంగతనం జరిగింది. బిగ్ సి షోరూంలో ఆదివారం రాత్రి ఒక వ్యక్తి చొరబడి రూ.5 లక్షల విలువైన అనేక మొబైల్ ఫోన్లను దొంగిలించినట్లు సమాచారం. వైరల్ అయిన వీడియో ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి మెట్ల పక్కన ఉన్న గోడకు కన్నం చేసి షోరూమ్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం
Thief allegedly drills through wall of Big C showroom in Dilsukhnagar, steals mobile phones worth Rs 5 lakh. Incident caught on CCTV. pic.twitter.com/zJDfhjitkE
— The Siasat Daily (@TheSiasatDaily) June 30, 2025
నిందితులు ఇనుప రాడ్, సుత్తిని ఉపయోగించి గోడను పగలగొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంతేకాకుండా దొంగతనం సమయంలో డ్రిల్లింగ్ చేస్తున్నపుడు సౌండ్ రాకుండా వారు చాలా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. షోరూమ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఆ దొంగ కొన్ని మొబైల్ ఫోన్‌లను దొంగిలించి పారిపోయాడు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు షోరూంలో దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.