/rtv/media/media_files/2025/04/26/sphWALXdkKF5j6K0TCjk.jpg)
Balanagar Si Suspension
Balanagar Si Suspension : అవినీతి ఆరోపణలతో పాటు వరుస వివాదాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మీనారయణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎస్‌ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీచేశారు.
Also Read:Pahalgam terror attack: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?
ఎస్‌ఐ లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి అరోపణలు వినపడుతున్నాయి. మరోవైపు ఓ మహిళ కేసు విషయంలో జోక్యం చేసుకున్న ఎస్సై అకారణంగా ముగ్గురిని చితకబాదినట్లు ఆరోపణలున్నాయి. దీంతో బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కమిషన్ లక్ష్మీనారాయణపై ఆరోపణలు నిజమేనని తేల్చడంతో పాటు చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సీపీ, ప్రాథమిక విచారణ అనంతరం ఎస్సై లక్ష్మీనారాయణను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీపీ కార్యాలయం తెలిపింది. పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిపైనా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన