BIG BREAKING: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు

రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న 3 రోజులు అధికారుల సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో CM వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

New Update
Telangana

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రి శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు