HYD:హైదరాబాద్ లో ఇళ్లు ఉన్న వారికి అలర్ట్.. అలా చేస్తే క్రిమినల్ కేసే!

అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్‌ తీసుకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ హెచ్చరించింది. శంషాబాద్‌ కుమ్మరి బస్తీలో పర్మిషన్ లేకుండా రెండు నల్లాలు, మోటార్లు వాడుతున్న ఏడుగురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు ఫైల్ చేశారు. 

erere
New Update

Hyderabad : హైదరాబాద్ లో ఇళ్లు ఉన్న వారికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ కీలక సూచన చేసింది. జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్‌ తీసుకుంటే క్రిమినల్ కేసులు పెడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనంగా నల్లా కలెక్షన్ తీసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహ్మద్‌ అర్షద్‌ అలీ తెలిపారు.

Also Read :  జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్!

Also Read :  సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి

ఏడుగురిపై క్రిమినల్ కేసు.. 

శంషాబాద్‌ లోని కుమ్మరి బస్తీకి చెందిన బి.రవి, బి.కృష్ణ, బి.కుమార్‌, బి.అంజయ్య, మహబూబ్‌ బీ, కె.బాల్‌రాజ్‌, టి.భాస్కర్‌లు మిషన్‌ భగీరథ రెండు నల్లాలతో పాటు బోరు మోటర్లతో నీళ్లను అక్రమంగా వాడుకుంటున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. అకస్మిక తనిఖీలు నిర్వహించిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అధికారులు.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహ్మద్ తెలిపారు. 
వారినుంచి నీటి సరఫరా చేసేందుకు ఉపయోగిస్తున్న ఎలక్ట్రికల్‌ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read :  బ్లాక్ బాడీకాన్ అవుట్ ఫిట్ లో..చేతిలో అది పట్టుకొని తమన్నా హాట్ ఫోజులు

ఇక ఆ ఏడుగురిపై పీడీపీపీఏ చట్టం సెక్షన్‌ 3, భారతీయ న్యాయ సంహిత 326(ఏ) 303 (2) సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు ఫైల్ చేశారు. జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజీ పైపులైన్‌ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజీ కనెక్షన్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్‌ బృందానికి 99899 98100, 99899 87135 ఫోన్‌ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. 

Also Read :  సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి

#criminal-case #hmwssb-alert #water
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe