భాగ్యనగరవాసులకు అలర్ట్! ఆ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ బంద్
భాగ్యనగరంలో ఉండేవారికి జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. వచ్చే శనివారం (19-08-2023) ఉదయం నుండి ఆదివారం (20-08-2023) మధ్యాహ్నం వరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో మరమ్మతుల కారణంగా నగరంలోని కూకట్పల్లి, లింగంపల్లి, జగద్గిరిగుట్ట, అమీర్పేటతో సహా పలుచోట్ల అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులు కోరారు.