High Court: అతడి జీవిత ఖైదు రద్దు.. హైకోర్టు..సంచలన తీర్పు

న్యాయానికి కళ్లు లేవంటారు. అందుకే న్యాయస్థానాల్లో  కేవలం సాక్ష్యులు చెప్పిన సాక్ష్యమే చెల్లుబాటవుతుంది. దాన్నిబట్టే తీర్పులు వెలువడుతాయి. అలాంటి ఓ కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

New Update
 High Court

High Court

High Court :  న్యాయానికి కళ్లు లేవంటారు. అందుకే న్యాయస్థానాల్లో  కేవలం సాక్ష్యులు చెప్పిన సాక్ష్యమే చెల్లుబాటవుతుంది. దాన్ని బట్టే తీర్పులు వెలువడుతాయి.  అయితే ఒక్కోసారి వ్యక్తిగత కక్షల మూలంగా నేరం చేయనివారు కూడా శిక్షకు గురవుతారు. అటువంటి కేసుల్లో కొన్నింటికి మాత్రమే న్యాయం జరుగుతుంది. అలాంటి ఓ కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Also read :  యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్

పదేండ్ల క్రితం అంటే 2014 ఫిబ్రవరి 20న ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిన హత్య కేసులో  ఒక వ్యక్తికి యావజ్జీవ శిక్ష విదించింది కోర్టు.అయితే 10 సంవత్సరాల తరువాత ఈ కేసు మళ్లీ కోర్టు ముందుకు వచ్చింది. దీంతో నిర్దోషిగా నిర్ధారింపబడిన తీర్పును హైకోర్టు ఇటీవల వెలువరించింది. ఈ కేసులో హత్యకు గురైన వ్యక్తి కార్తీక్‌ కాగా.. నిందితుడు షంషేర్‌ఖాన్‌. ఆయనకు 2018 జనవరి 5న ఆదిలాబాద్‌ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే.. ఈ తీర్పును షంషేర్‌ఖాన్‌ హైకోర్టులో సవాలు చేస్తూ  అప్పీల్‌ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి

హైకోర్టులో విచారణ చేపట్టిన జస్టిస్‌ కె. సురేందర్‌ ఈ కేసులో అతడు నిర్దోషిగా ప్రకటించారు. ఆయన తీర్పులో కొన్ని కీలకాంశాలు వెల్లడించారు.  ప్రాసిక్యూషన్‌ ద్వారా సమర్పించబడిన ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలు సందేహాస్పదంగా ఉన్నాయని.. ఈ వాంగ్మూలాలు విచారణ సమయంలో అస్పష్టంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఫిర్యాదు చేసేందుకు గడువు పరిమితి కూడా అనుమానాస్పదంగా కనిపించిందని కోర్టు గమనించింది. 2014 ఫిబ్రవరి 20న రాత్రి 9 గంటలకు జరిగిన సంఘటనను 21వ తేదీన కోర్టుకు తెలియజేసిన దర్యాప్తు అధికారులపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. 16 గంటల జాప్యం.. దీనిపై దర్యాప్తు అధికారుల వివరాలు ఇవ్వకపోవడంపై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

Also Read :  పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఈ కాలేజీల్లో మీ పిల్లలున్నారా?
   
అంతేకాకుండా.. మరొక కీలకమైన అంశం మృతుడి తండ్రికి ఓ వ్యక్తి.. కొబ్బరికాయలు కొట్టే కత్తితో నరికి పారిపోయాడంటూ సమాచారం ఇచ్చాడు. తర్వాత అతడు మేజిస్ట్రేట్‌ ముందు ఎవరు చంపారో తనకు తెలియదంటూ వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఇలా చెప్పడంతో అస్పష్టత వచ్చింది. తదుపరి.. అక్కడ ప్రత్యక్ష సాక్షులు మాత్రం మెడపై కత్తితో నరికి చంపారని చెప్పారు. కానీ.. తలకు తీవ్రమైన గాయం కావడంతో మృతిచెందారని పోస్టుమార్టంలో తేలిందన్నారు. ఈ అంశాలపై కోర్టు విచారణ చేసి.. షంషేర్‌ఖాన్‌పై ఉన్న ఆరోపణలు సందేహాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. అందువల్ల.. షంషేర్‌ఖాన్‌పై మోపిన యావజ్జీవ శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇతర కేసుల్లో నిందితుడి పాత్ర కనుగొనబడకపోవడం.. తదుపరి కోర్టులో చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున.. కోర్టు షంషేర్‌ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  

Also Read: టార్గెట్ కేసీఆర్.. కేబినెట్లోకి రాములమ్మ.. హైకమాండ్ సంచలన వ్యూహం ఇదేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు