Lady Aghori: అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్.. 100 మంది పోలీసులతో!

అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లిలోని అఘోరీ ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తున్నారు.

New Update

అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లిలోని అఘోరీ ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తున్నారు. దీని కారణంగా పోలసులు భారీగా భద్రత కట్టుదిట్టం చేశారు.

Also Read: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

అఘోరీ బయటకు రాకుండా కట్టుదిట్టం

అక్కడి భద్రతను ఏసీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అఘోరీ బయటకు రాకుండా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా అఘోరీని కలిసేందుకు పోలీసులు ఎవరికీ అనుమతివ్వడం లేదు. కాగా ఇటీవలే సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరీ ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Also Read : యష్మీ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నిఖిల్.. బతిమాలినా వద్దంటూ.. 

ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకొని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో ముందస్తు జాగ్రత్తగా అఘోరీని ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు.

Also Read: 'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. హిట్టా? ఫట్టా ? ఈ ఒక్క రివ్యూ చూస్తే చాలు

హైదరాబాద్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి సిద్దిపేటలో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎస్కాట్ మధ్య అఘోరీని మంచిర్యాల జిల్లాలోని తన స్వగ్రామమైన కుషనపల్లికి తీసుకెళ్లి.. తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇక తనను అదుపులోకి తీసుకోవడంపై అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

కాగా తెలంగాణలో లేడీ అఘోరీ గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. నగ్నంగా పలు ఆలయాలు సందర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను చాలా మీడియాలు ఇంటర్వ్యూ చేశాయి. ఆపై మళ్లీ కేదరినాథ్ వెళ్లిపోయిన ఆ లేడీ అఘోరీ మళ్లీ తిరిగి అక్టోబర్ 29న వస్తానని తెలిపింది. 

Also Read:  యువరాణిలా ముస్తాబైన నటి.. కేతిక శర్మని ఇలా చూస్తే అంతే సంగతి!

ఆమె అనుకున్నట్లుగానే అక్టోబర్ 29న తెలంగాణకు తిరిగి వచ్చింది. సనాతన ధర్మంపై పోరాటం చేస్తానని. అందులో భాగంగానే తాను ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. ఈ ఆత్మార్పణలో తాను చనిపోతే శివుని దగ్గరకు వెళ్లిపోతానని.. చావకపోతే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో అక్టోబర్ 31న ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు