'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. హిట్టా? ఫట్టా ? ఈ ఒక్క రివ్యూ చూస్తే చాలు

శివకార్తికేయన్ హీరోగా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం 'అమరన్'. నేడు దీపావళి కానుకగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు ట్విట్టర్ మంచి రివ్యూస్ వస్తున్నాయి. డైరెక్టర్ మేజర్ ముకుంద్ లైఫ్ ను చక్కగా చూపించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

New Update

Amaran: కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'అమరన్'. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రలో నటించగా.. రాహుల్ బోస్ కమాండింగ్ ఆఫీసర్ పాత్రను పోషించారు.

ట్విట్టర్ రివ్యూ 

నేడు  దీపావళి కానుకగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ట్విట్టర్ లో నెటిజన్లు పాజిటివ్ రివ్యూస్ తో కామెంట్స్ పెడుతున్నారు. అమరన్ సినిమాకు పై ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం

దేశం కోసం మేజర్ ముకుంద్ వరదరాజన్ చేసిన త్యాగం, ఆయన పోరాటాన్ని డైరెక్టర్ చాలా చక్కగా చూపించినట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగినప్పటికీ.. ఇంట్రెస్టింగ్ గా ఉందని చెబుతున్నారు. చిత్రం సినిమాలోని ఫ్యామిలీ సైడ్,  రైజ్ ఆఫ్ ముకుంద్ క్యారెక్టర్ హాలైట్ అని అంటున్నారు. ముఖ్యంగా మేజర్ ముకుంద్ వైఫ్ ఇందు ఇందు రెబెకా వర్గీస్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి యాక్టింగ్ సినిమాకే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్  అని ట్వీట్ చేస్తున్నారు. అలాగే శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి కాంబోలోని ప్ర‌తీ సీన్ ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తుంద‌ని అంటున్నారు. 

ఇది కూడా చూడండి:  గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు