Balka Suman:'బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కనిపించడం లేదు'
సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పులు చూపిస్తూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బాల్క సుమన్ పరారీలో ఉన్నారు. ఆయనకోసం గాలింపు చర్యలు చేపట్టారు.