గాంధీ భవన్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో హైటెన్షన్ నెలకొంది. సీనియర్ నేత వీ. హనుమంతరావు ముస్లింలు ఎన్నికల వరకు కాంగ్రెస్‌ పార్టీతో ఉండి.. పోలింగ్ సమయంలో హ్యాండిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా నేతల కుర్చీలు గాల్లోకి లేచాయి.

New Update

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సమావేశంలో నేతల మధ్య గందరగోళం చోటుచేసుకుంది. సీనియర్ నేత వీ. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎన్నికల వరకు కాంగ్రెస్‌ పార్టీతో ఉండి.. పోలింగ్ సమయంలో హ్యాండిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. ఆయన చేసి కామెంట్స్‌తో ఒక్కసారిగా  కుర్చీలు గాల్లోకి లేచాయి.   

Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి

ఓ వర్గం నేతలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీహెచ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో వెంటనే సమావేశం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిపోయారు. 

Also Read: మసీదులో జైశ్రీరాం అంటే తప్పేంటి..సుప్రీంకోర్టు ప్రశ్న

Advertisment
తాజా కథనాలు