అది నాకు తెలియని సబ్జెక్టు.. గ్రూప్ 1 పై వి.హనుమంతరావు వ్యాఖ్యలు | V. Hanumantha Rao on Group1 | RTV
V. Hanumantha Rao : ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
TG: ముస్లింలను భారత్ దేశం నుంచి వెళ్ళగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
VH Interview: ఖమ్మం టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే: వీహెచ్ సంచలనం!
తనకు ఖమ్మం ఎంపీగా అభ్యర్థిగా అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు తనను ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా తాను అక్కడ జరిగిన అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు.
Revanth Reddy : జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే!
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపైనే నేరుగా వీహెచ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగి వీహెచ్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. రానున్న రోజుల్లో మంచి అవకాశం కల్పిస్తానని వీహెచ్ కు రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
T-Congress Politics : వీహెచ్ కు టీపీసీసీ షాక్.. అలా చేస్తే వేటే అంటూ వార్నింగ్!
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ షాకిచ్చారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల వీహెచ్ సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
V. Hanumantha Rao: భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేశారు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
భట్టి విక్రమార్కపై సంచలన ఆరోపణలు చేశారు వీహెచ్. తనను ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయకుండా భట్టి అడ్డుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.