Supreme Court: మసీదులో జైశ్రీరాం అంటే తప్పేంటి..సుప్రీంకోర్టు ప్రశ్న

కర్ణాటకలో ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

New Update
Supreme Court

మసీదులో జైశ్రీరాం అంటే తప్పేముంది అంటూ సుప్రీంకోర్టు ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేసింది. కర్ణాటకలో ఓ మసీదులో జైశ్రీరాం అన్నారని పిటిషన్ దాఖలు అయింది. దీనిపై కోర్టు ఈరోజు విచారణ చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. సీసీ ఫుటేజీ లేదా ఇంకేదైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటూ కోర్టు బెంచ్ అడిగారు. 

ఈ కేసును జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్ ఈ రోజు విచారణ చేసింది. అంతకు ముందు ఈ కేసుపై కర్ణాటక హైకోర్టు విచారణ చేసి తీర్పును ఇచ్చింది. మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బ తీయడం కాదంటూ కర్ణాటక హైకోర్టు  తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ ప్రశ్నలను అప్పీలుదారు తరఫు న్యాయవాదిని అడిగిన సుప్రీంకోర్టు ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పీలు దాఖలు చేయలేదు.

గతేడాది జరిగిన సంఘటన..

దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు గత ఏడాది మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేశారని, అక్కడున్న వారిని బెదిరించారని ఆరోపించారు. నిందితులిద్దరూ ముస్లింలను శాంతియుతంగా బతకనివ్వమని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఇరువురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 295A (మతపరమైన భావాలను దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో చేసిన చర్యలు), 447 (అతిక్రమం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.

Also Read: Rajyasabha: నెహ్రూ లేఖల దుమారం..మోదీ పై మండిపడ్డ ఖర్గే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు