Traffic Jam: తిరుగుపయనమవుతున్న నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జాం

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతున్నారు. యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్దకు భారీగా వాహనాలు వస్తున్నాయి. మొత్తం 12 టోల్‌బుత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలకు పర్మిషన్ ఇస్తున్నారు.

New Update
Traffic Jam

Traffic Jam

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ వాసులు సొంతూళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి మళ్లీ తిరుగుపయనమవుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్దకు భారీగా వాహనాలు వస్తున్నాయి. మొత్తం 12 టోల్‌బుత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలకు పర్మిషన్ ఇస్తున్నారు.   

Also Read: తెలంగాణలో ఘోర అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం

కిలోమీటర్ల వరకు వాహనాలు క్యూ కట్టాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలకగకుండా పోలీసులు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లలో కూడా రద్దీ పెరుగుతోది. రద్దీ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు 116 అదనపు బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కూడా కల్పించామని.. సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.  

Also Read: 2025లో ప్రపంచానికి పొంచిఉన్న ముప్పులివే..

Also Read: ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసమా ? సైకిల్ ట్రాక్‌ల కోసమా ?.. సుప్రీంకోర్టు ఆగ్రహం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు