Fire Accident: తెలంగాణలో ఘోర అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం

బుధవారం రాత్రి ఖమ్మం పత్తి మార్కె్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ గోడౌన్‌లో నిల్వఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

New Update
Cotton Fire

Cotton Fire

కనుమ పండుగ వేళ ఖమ్మం పత్తి మార్కె్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి మార్కెట్‌ యార్డ్‌ షెడ్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో షెడ్‌లో నిల్వచేసిన పత్తి బస్తాలు తగలబడిపోయాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

Also Read: దారుణం.. కానిస్టేబుల్ మెడ కోసిన చైనా మాంజా

అయితే ఈ అగ్నిప్రమాదంలో మర్కెట్‌ గోడౌన్‌లో ఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే పత్తి మార్కెట్‌కు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 16 వరకు సెలవులు ఉన్నాయి. పండుగకు ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి మార్కెట్ యార్డులో ఉంచారు. కానీ ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో పత్తి బస్తాలు కాలిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.   

అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో పత్తి బస్తాలు దగ్ధమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం జరగడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తమను ప్రభుత్వం ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు. 

Also Read: కుంభమేళలో ఈ బ్యూటీ సాధ్వి కాదు.. ఎవరీ హర్ష రిచారియా..?

సమాచారాం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి.. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరగడంతో మార్కెట్‎కు వచ్చిన రైతులు భయాందోళనకు గురి అయ్యారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు