/rtv/media/media_files/2025/04/14/AeimO8QAdepUvk8kRlfE.jpg)
constable dies of heart attack
Heart attack : సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ దిగావత్ రమేష్ నాయక్ (50) గుండెపోటుతో మృతి చెందారు. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన రమేష్ నాయక్ గత 3 సంవత్సరాలుగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉండగా ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సహచర సిబ్బంది వెంటనే స్పందించి.. ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన దిగావత్ రమేష్ నాయక్ (50) గత మూడు సంవత్సరాలుగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చనిపోయిన రమేష్ రాథోడ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని రమేష్ మృతదేహాన్ని అతని స్వగ్రామమైన తుంగతుర్తికి తరలించారు. ఆయన మరణంతో తుంగతుర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేష్ నాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. గతంలో 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూసేవాళ్లం. కరోనా తర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. హృద్రోగ సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర కలిగిన వారికి ఈ ముప్పు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్