Harish Rao: మంచి మనసు చాటుకున్న హరీశ్‌రావు.. పేద విద్యార్థిని కోసం సొంత ఇళ్లు తనఖా

ఓ పేద విద్యార్థిని చదువు కోసం మాజీమంత్రి హరీశ్‌రావు మంచి మనుసును చాటుకున్నారు. ఆ యువతి పీజీ వైద్య విద్య కోసం ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
harish rao mortgaged his home for Medical Student Study

harish rao mortgaged his home for Medical Student Study

ఓ పేద విద్యార్థిని చదువు కోసం మాజీమంత్రి హరీశ్‌రావు మంచి మనుసును చాటుకున్నారు. ఆ యువతి పీజీ వైద్య విద్య కోసం ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మమత అనే విద్యార్థిని ఉచితంగా MBBS సీటు సాధించి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత పీజీ ఎంట్రన్స్‌ పరీక్ష రాయగా మహబూబ్‌నగర్‌లోని SVS మెడికల్ కాలేజీలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. 

Also Read: రూ.15వేల కోట్ల విలువైన భూమి తెలంగాణదే: సుప్రీంకోర్టు

పీజీ ఎంట్రన్స్‌లో సీటు వచ్చినా కుడా ట్యూషన్ ఫీజులకు ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం కోసం వెళ్తే ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. డిసెంబర్ 18న ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటు తిరస్కరించే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మమత కుటుంబ సభ్యులు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఏకంగా తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌ మంజూరు చేయించారు. అంతేకాదు మమత హాస్టల్‌ ఫీజు కోసం లక్ష రూపాయలు ఇచ్చారు. 

Also Read: జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు.. BC రిజర్వేషన్‌పై రేవంత్ సర్కార్ ప్లాన్ ఇదే!

Advertisment
తాజా కథనాలు