Hanuman Jayanti 2025: రేపు హనుమాన్‌ శోభాయాత్ర...ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్రలో వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొననున్నారు. ఈ మేరకు పోలీసులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

New Update
Hanuman Jayanthi Shobha Yatra

Hanuman Jayanthi Shobha Yatra

Traffic Advisory : ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్రలో వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొననున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేరకు పోలీసులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆ మార్గంలో వెళ్లాలనుకునేవారు ముందుగా ప్లాన్‌ చేసుకుని వెళ్తే మంచిది. లేదంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం ఖాయం.

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

Hanuman Jayanti Shobha Yatra - Traffic Restrictions

కాగా హనుమాన్‌ శోభాయాత్ర  ఉదయం 11 గంటలకు గౌలిగూడలోని శ్రీ రామమందిరం వద్ద  ప్రారంభమవుతుంది.తాడ్‌బండ్‌లోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద ముగుస్తుంది. ఈ మార్గంలో పలు కీలక ప్రాంతాలున్నాయి.శోభాయాత్ర మార్గం పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‌పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట రోడ్, పారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా సాగుతూ తాడ్‌బండ్‌లోని హనుమాన్ టెంపుల్‌కు చేరుకుంటుంది.

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

ఈ శోభాయాత్ర సజావుగా సాగేందుకు పోలీసు శాఖ శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఈ మార్గంలో  ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారడైజ్ ఫ్లై ఓవర్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవాలని సలహా ఇచ్చారు. ఈ శోభాయాత్రలో భక్తుల భద్రత , ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది, కాబట్టి నగరవాసులు ఈ ఆంక్షలకు సహకరించి, హనుమాన్ జయంతి వేడుకలు సాంతం సజావుగా జరిగేలా తోడ్పడాలని అధికారులు కోరుతున్నారు. కాగా ప్రతి ఏడాది హనుమాన్‌ జయంతి సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున భక్తులు శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిసార్లు సరైన సమాచారం లేకపోవడంతో చాలామంది శోభాయాత్రలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

Also Read :  ఇళ్లు కోసం బిడ్డను చంపిన సవతి తల్లి.. హైదరాబాద్‌లో హతమార్చి నల్గొండలో పాతిపెట్టి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు