హనుమకొండ జిల్లాకు చెందిన బండి వంశీ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓ యూనివర్సిటీలో ఎమ్మెస్ చేయడానికి ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లిన వంశీ అక్కడే చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి అతను ఉంటున్న అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కారు సీట్లో శవమై కనిపించాడు. మర్నాడు ఉదయం అతని స్నేహితులు ఉదయం గమనించి కుటుంబ సభ్యలకు సమాచారం అందించారు.
వంశీ మృతి గురించి తెలుసుకున్న అతని తల్లిదండ్రులు ఏం జరిగిందో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడి మరణం విషయాన్ని కమలాపూర్ మండల బీజేపీ నేత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్ళారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చొరవ తీసుకోవాలని, ఘటనపై దర్యాప్తు చేయించాలని కోరారు.
Also Read: Amazon Prime: నెట్‌ఫ్లిక్స్ బాటలో ప్రైమ్..నో షేరింగ్