STUDENTS MISSING : ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఏం చేశారంటే....

ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటనా సూర్యపేట జిల్లా కోదాడ మండలం లో కలకలం రేపింది. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని మునగాల నెమలిపురి ఆర్ఆర్ సెంటర్ లో గల ఎస్సీ గురుకుల పాఠశాలలో 10 తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు.

New Update
STUDENTS MISSING

STUDENTS MISSING

STUDENTS MISSING : ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటనా సూర్యపేట జిల్లా కోదాడ మండలం లో కలకలం రేపింది. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని మునగాల నెమలిపురి ఆర్ఆర్ సెంటర్ లో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి కనిపించడంలేదు. దీంతో ఉపాధ్యాయులు చుట్టు పక్కల వెతికి సాయంత్రం వరకు వస్తారనుకొని వేచి చూశారు. సాయంత్రమైన తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయుడు మందలించడం వల్లే విద్యార్థులు బయటకు వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెప్పారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.  

Also Read :  తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్‌లైన్‌ వీడియోలతో లక్షల్లో టోకరా!

కాగా పదవతరగతి క్లాసులు ముగిస్తుండటం, పరీక్షలు దగ్గర పడుతుండటంతో రెండు రోజుల క్రితం పదవతరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీలో పదిమంది విద్యార్థులు మద్యం సేవించి తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతో గొడవకు దిగినట్లు తెలిసింది. దీంతో టీచర్లు వారిని మందలించారు. అది మనసులో పెట్టుకున్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు వారి ఆచూకీ కోసం చుట్టూ పక్కల వెతికారు. అయినా వారి జాడ లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఒకవేళ ఇంటికి గానీ వచ్చారా అని ఆరాతీశారు. ఇంటికి కూడా రాలేదని తెలియడంతో మరింత ఆందోళన చెందిన ప్రిన్సిపాల్‌ ఝాన్సీ కోదాడ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ పిల్లలు కనిపించడం లేదని తెలిసి తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యులను వారికి తెలిసిన బంధు మిత్రుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.


  Also Read :  వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్


కాగా విద్యార్థులు  అకారణంగా అల్లరి చేస్తే మందలించడమే తప్పయిందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతుండగా, తమ పిల్లల్ని ఉపాధ్యాయులు కొట్టడం వల్లే వారు బయటకు వెళ్లిపోయారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా సూర్యాపేటలో కనిపించకుండా పోయిన విద్యార్థులు నేరుగా విజయవాడకు చేరుకున్నట్లు తెలిసింది. స్థానిక పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న విద్యార్థులను ఆదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పూర్తి వివరాలు చెప్పడంతో సూర్యాపేట పోలీసులకు సమాచారం అందించారు.కాగా స్థానిక పోలీసుల సహాకారంతో వారిని విజయవాడ నుంచి సూర్యాపేటకు రప్పించారు.

Also Read :  2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు