/rtv/media/media_files/2025/03/05/2fU3mTKVuBUnJpaJ8Tra.jpg)
Telangana MLC Elections Results
Telangana MLC Elections Results :ఉమ్మడి కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. అభ్యర్థుల ఎలిమినేషన్ కొనసాగుతుండగా 52వ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి 77,851 ఓట్లు ,కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి 72,038 ఓట్లతో రెండో స్థానంలో, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 63,679 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్, ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ ఉంటుందని భావించినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మొత్తం ఓట్లలో 38 శాతం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 35.5శాతం ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 30 శాతం ఓట్లు సాధించారు.
ఇది కూడా చదవండి: Sharmila: జగనన్నను వదలని షర్మిల.. ఆ కుట్రలో కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ఆరోపణలు!
ఇప్పటి వరకు అభ్యర్థులెవరూ 50 శాతం ఓట్లను సాధించలేకపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి సరైన మెజారిటీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తప్పనిసరి అయ్యింది. అయితే కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఒకటి చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటమైతే, రెండవది బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించడం. మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో బ్యాలెట్ పేపరు చాలా పెద్దగా ముద్రించాల్సి వచ్చింది.
Also read: Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!
ఈసారి పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో ప్రాథమికంగా 21వేల పైచిలుకు బ్యాలెట్ పత్రాలను చెల్లని ఓట్ల జాబితాలో చేర్చారు. వీటి విషయంలో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత మరోసారి వీటిని పరిశీలించి పక్కాగా ఎన్ని చెల్లడం లేదనేది ఎన్నికల అధికారి వెల్లడిస్తారు. అందువల్లే గెలుపు కోటా ఎంతనేది ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఆయా రౌండ్ల లెక్కింపు సమయంలోనూ 5 నుంచి 10 చెల్లని ఓట్లు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరస్కరణకు గురైన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.
Also Read : ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
లెక్కింపు కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ మైదానంలో నిర్విరామంగా కొనసాగుతోంది. 21 టేబుళ్లపై రౌండ్‌కు 21వేల ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 11 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. గత నెల 27న జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో 2,50,106 ఓట్లు పోలయ్యాయి. మరో 4వేల వరకు తపాలా ఓట్లు పడ్డాయి. ఇందులో చెల్లినవి, చెల్లనివి పరిగణనలోకి తీసుకుని విజేతకు అవసరమైన ఓట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. ఇప్పుడున్న వివరాల ప్రకారం 1,14,000 కుపైగా ఎవరికి వస్తే వారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుస్తారు. ఈ సంఖ్య మొదటి ప్రాధాన్యంలో ఏ అభ్యర్థీ చేరుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారింది.
ఇది కూడా చదవంటి: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
నన్ను ఓడించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నన్ను ఓడించేందుకు ఒక్కటయ్యాయని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు వేరైనా పట్టభద్రుల బ్యాలెట్ పేపర్ పై ఒకటయ్యాయన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..నన్ను నమ్ముకున్న వ్యక్తుల సమస్యల కోసం భవిష్యత్తులో కొట్లాడుతూ రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. ప్రసన్న హరికృష్ణ ఒకడు కాదని ఓట్ల రూపంలో చూపించారని గత ఏడు నెలలుగా నా కోసం కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను తిరిగి ఉద్యోగంలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Also read : సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు
సంబంధం లేని వ్యక్తులు వచ్చి రాజకీయాలను కలుషితం చేస్తున్నారనే తాను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మరొక పదిమందిని తయారు చేస్తాడని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయన్నారు. రూపాయి ఖర్చు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించాను. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వణుకు పుట్టించామన్నారు. నన్ను అడ్డుకునేందుకు సీఎం మూడు సభలు పెట్టారు. నా నామినేషన్ ను అడ్డుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నం చేశారన్నారు. బీఆర్ఎస్ నాకు మద్దతు ఇవ్వలేదు. నేను వారిని మద్దతు అడగలేదన్నారు. ఓటర్ కు ఒక రూపాయి పంచకుండానే 60 వేల పైగా ఓట్లు తెచ్చుకోగలిగాన్నారు.
Also read : చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం