Elon Musk: చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం

చైనా AI డీప్‌సీక్ కారణంగా టెక్ దిగ్గజం ఎలన్ మస్క్‌కు భారీగా నష్టం వచ్చింది. టెస్లా CEO మస్క్ ఫిబ్రవరిలో దాదాపు 90 బిలియన్ డాలర్లు(రూ. 7.90 లక్షల కోట్లు) కోల్పోయారని పలు నివేదికలు అంచనా వేశాయి. డీప్‌సీక్ కారణంగా ఇతర కంపెనీలు సైతం తీవ్రంగా నష్ట పోయాయి.

New Update
deepseek ai elon musk

deepseek ai elon musk Photograph: (deepseek ai elon musk)

ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్‌కు చైనా స్టార్టప్ కంపెనీ కారణంగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. చైనా ఏఐ డీప్ సీక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో దీని ప్రభావం టెక్ దిగ్గజాలపై ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ నెల రోజుల్లోనే దాదాపు 90 బిలియన్ డాలర్లు (రూ. 7.90 లక్షల కోట్లు) సంపద కోల్పోయారని పలు నివేదికలు అంచనా వేశాయి. ఫిబ్రవరి ప్రారంభంలో మస్క్ నికర విలువ 433 బిలియన్ డాలర్లు ఉండగా.. నెలాఖరు నాటికి 349 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు 90 బిలియన్ డాలర్ల సంపద మస్క్ కోల్పోయారు. అలాగే ఇతర టెక్ దిగ్గజాలు సైతం తీవ్రంగా నష్ట పోయారు. 

Also read: Donald Trump: 13ఏళ్ల బాలుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. ట్రంప్ నిర్ణయానికి ఇదే కారణం!

ఎన్వీడియా సీఈఓ జెన్సెస్ హువాంగ్ సంపద 20 బిలియన్ డాలర్లు, మెటా సీఈఓ జుకర్ బర్గ్ సంపద 11 బిలియన్ డాలర్లు, ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ 27.6 బిలియన్ల నష్టాన్ని చవిచూశారు. అయితే నష్టాలు చవిచూసినప్పటికీ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ డీప్ సీక్‌ టెక్నాలజీపై ప్రశంసల వర్షం కురిపించారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు