సొంత పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన ఇక భరించలేకపోతున్నాని.. పార్టీకి తాను అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను సూచించగా, వారి పేర్లను పక్కనపెట్టి.. ఎంఐఎంతో తిరిగే వారికి ఇవ్వడం ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు.
Also Read : తెలుగు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తండ్రి కన్నుమూత!
ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే ఆ ఎన్నిక విషయం తనకు తెలియదంటూ సమాధానమిచ్చారని అన్నారు. ఆయన చెప్పిన ఆ ఒక్కమాటతో తనపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడిందన్నారు. ఇప్పటివవరకూ తాను బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో యుద్ధం చేశానని ఇప్పుడు సొంత పార్టీతో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరమని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వాలని.. ఇది ప్రతి చోటా జరుగుతుందన్నారు.
బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు
కానీ ఇక్కడ తాను సూచించిన వారి పేర్లను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా వెంటనే అధ్యక్షుడిని మార్చాలని కోరారు. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని కానీ రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ అన్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న రాజాసింగ్ ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీపై ఇలాంటి కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి రాజాసింగ్ కామెంట్స్ పై పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read : Veera Raghava Reddy: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
వెళ్లిపో అంటే వెళ్లిపోతా.. బీజేపీలో వేధింపులు భరించలేకపోతున్నా : ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
సొంత పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన పార్టీకి తాను అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు.
raja singh MLA