/rtv/media/media_files/2025/03/06/zVpEsaI22tukXcbqN71t.jpg)
The Indira Mahila Shakti policy
The Indira Mahila Shakti policy : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఈనెల 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళా సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీని విడుదల చేయనున్నారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే సదస్సుకు మహిళలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేయాలనన్నారు. ఎండ నుంచి ఉపశమనం కలిగేలా మజ్జిగ ప్యాకెట్లు అందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
Also read: Ap news: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జు
కాగా, ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా రేవంత్ సర్కార్ కొత్త పథకాలు ప్రారంభించనుంది. నారాయణ పేట జిల్లాలో మహిళలే పెట్రోలు బంకులను నిర్వహించేలా ఇప్పటికే స్కీం తీసుకురాగా.. మిగతా 31 జిల్లాల్లోనూ మహిళలకు పెట్రోల్ బంకులు అప్పగించేందుకు సర్కార్ చమురు సంస్థలతో ఒప్పందం చేసుకోనుంది. మహిళా సంఘాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మహిళా సంఘాల కోసం ఆర్టీసీ అద్దె బస్సులను కూడా సీఎం ప్రారంభించనున్నారు. తొలి విడతలో 50 బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిసింది. సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయటంతో పాటుగా..14,000 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు
ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికోసం మరన్ని పథకాలు తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పాలసీని తీసుకురానుంది. ఈ పాలసీలో భాగంగా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన పథకాలను ప్రారంభించడానికి రేవంత్ సర్కార్ సన్నద్ధం చేస్తోంది. రానున్న రోజుల్లో ఎన్నికల్లో మహిళలకు హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేస్తామని రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం పలు పథకాలను మహిళలకు నేరుగా అందించేందుకు సిద్ధమైంది. ఆ పథకాల ద్వారా మహిళలను ఆకర్శించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతున్నది.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
Follow Us