Ap news: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జు

ఏలూరు జిల్లా సోమవరప్పాడు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్ బస్సు అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.  

New Update
eluru road accident

eluru road accident Photograph: (eluru road accident)

ఏలూరు జిల్లా సోమవరప్పాడు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్ బస్సు అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా.. 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. బస్సు నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వెంకటరమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సహయక చర్యలు చేపట్టారు. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు మీద అడ్డం తొలగించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణం ఏంటని విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు