/rtv/media/media_files/2025/07/11/ghmc-breakfast-2025-07-11-19-03-02.jpg)
GHMC Breakfast canteen
GHMC Breakfast: గ్రేటర్ హైదరాబాద్‌లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్ టిఫిన్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా అందించనున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం మాత్రమే అందిస్తుండగా.. దాంతో పాటు ఉదయం పూట టిఫిన్స్ అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. క్యాంటీన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి క్యాంటీన్ లో కూర్చొని తినే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందిరమ్మ కాంటీన్ - రూ.5 బ్రేక్ ఫాస్ట్
— Congress for Telangana (@Congress4TS) July 11, 2025
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆమోదం తెలిపింది.#GHMC#Breakfast#IndirammaCanteenspic.twitter.com/5RiJ5uD8P7
ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్‌ఫాస్ట్ మెనూను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ఒక టిఫిన్‌కు మొత్తం ఖర్చు రూ.19గా అంచనా వేయగా ప్రజల నుంచి ఒక్కో టిఫిన్‌కు కేవలం రూ.5 మాత్రమే వసూలు చేయనుంది. మిగతా రూ.14 ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా దీన్ని అమలు చేయాలని భావిస్తోంది.కాగా జీహెచ్‌ఎంసీరూపొందించిన మెనూను హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఆరోగ్యకరంగా ఉండేలా మిల్లెట్ ఫుడ్‌కు ప్రాధాన్యతనిస్తూ రోజుకో రకం అల్పాహారాన్ని అందించనున్నారు. మెనూలో 6 రోజుల అల్పాహారం ఉండబోతుంది.
మొదటి రోజు: మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
2వ రోజు : మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
3 వ రోజు : పొంగల్, సాంబార్, చట్నీ
4వ రోజు : ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
5వ రోజు: పొంగల్, సాంబార్, చట్నీ
6వ రోజు : పూరీ (3), ఆలూ కూర్మా
ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం జీహెచ్‌ఎంసీ 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్లను ఏర్పాటు చేస్తోంది. దీని కోసం మొత్తం రూ.11.43 కోట్ల వ్యయం చేయనుంది. ప్రతి క్యాంటీన్‌లో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.