TG News: హైదరాబాద్‌లో దారుణం.. ఎస్సై తల పగలగొట్టిన గంజాయి గ్యాంగ్‌

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులపై దాడికి దిగింది. బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో ఎస్ఐ తల పగిలింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
police 2

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లోని మెహిదీపట్నం పరిధిలోని హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గరలో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఒక్కసారిగా పోలీసులపై గంజాయి బ్యాచ్‌ దాడులకు దిగింది. బీర్ ​బాటిల్స్‌తో ఓ ఎస్సై తల పగులగొట్టారు. ఇన్​స్పెక్టర్ రాంబాబు చెప్పిన వివరాల ప్రకారం.. గంజాయి ఉందన్న సమాచారంతో తనిఖీలు చేసేందుకు నార్కోటిక్ ఇన్​స్పెక్టర్లు దిలీప్, రాజశేఖర్, ఎస్సైలు శివకుమార్, సందీప్, అశోక్, కానిస్టేబుళ్లు అర్ధరాత్రి హబీబ్​నగర్ పీఎస్​ పరిధిలో ఉన్న మంగర్​బస్తీకి వెళ్లారు. 

Also Read: మేడిగడ్డపై 738 పేజీల సంచలన నివేదిక

వస్తున్నారని పసిగట్టిన పాత నేరస్తుడు:

పోలీసులు వస్తున్నారని పసిగట్టిన పాత నేరస్తుడు, గంజాయి వ్యాపారి అయిన కంబ్లీ దీపక్‌, అతని సోదరుడు అరుణ్‌ పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాళ్లను వెంబడించి పట్టుకున్నారు. అయితే పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా సోదరుడు అరుణ్‌ స్థానికులను రెచ్చగొట్టి అక్కడికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా పోలీసులను అడ్డుకున్నారు. అందరూ కలిసి ఒక్కసారిగా పోలీసులపై దాడులకు దిగారు. 

ఇది కూడా చదవండి: లోదుస్తులు ధరించి నిద్రించకూడదా?.. అసలు నిజం ఏంటి?

బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో ఎస్సై శివకుమార్ తలకు గాయమైంది. దాడి టైంలో కొందరు ఎస్సై మెడలోని రెండు తులాల బంగారు చైన్‌ లాక్కుని పరారయ్యారు. దీంతో పోలీసులు కంబ్లీ దీపక్, అరుణ్‌ను అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఎస్సైని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే మంగర్‌బస్తీలో భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర ప్రమాదం...ఇద్దరు మహిళలు మృత్యువాత

 

ఇది కూడా చదవండి: భోజనం తర్వాత ఇలా చేశారంటే లివర్‌ పాడైపోతుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు