హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. కొత్తగా మరో స్కైవాక్, ఎక్కడంటే? హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో కొత్తగా స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ ఎంసీ స్కైవాక్ నిర్మించనుంది. By Seetha Ram 02 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి హైదరాబాద్ నగరం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. మరోవైపు నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తరుణంలోనే ఫైఓవర్లు, అండర్ పాసులు నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగంలో ఫైఓవర్లు, అండర్ పాసులు నిర్మించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో పయణిస్తుంది. ఇందులో భాగంగానే కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ మేరకు నగరంలో మరో స్కైవాక్ నిర్మించడానికి రెడీ అయింది. పరేడ్ గ్రౌండ్ మెట్రో రైలు స్టేషన్ వద్ద కొత్తగా స్కైవాక్ నిర్మించేందుకు సిద్ధమైంది. Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది! కొత్తగా మరో స్కైవాక్ పరేడ్ గ్రౌండ్ మెట్రోరైలు స్టేషన్ నుంచి తరచూ అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అదే క్రమంలో అక్కడి ఫైఓవర్ కారణంగా మెట్రో స్టేషన్ నుంచి కిందకి వచ్చి రోడ్డు దాటాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం.. అక్కడ అత్యంత రద్దీ ప్రాంతం కావడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ స్కైవాక్ pic.twitter.com/ZOEehO1nyk — Kommu NaveenKumar KNK (@KommuBrsparty) June 27, 2023 Also read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు! ఎల్ అండ్ టీ మెట్రోకు కేటాయించిన భూములు ఉండటంతో అనుసంధానం కోసం అక్కడ స్కైవాక్ నిర్మించడానికి సిద్ధమైంది. దీని కారణంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణాలు సాగిస్తారని జిహెచ్ ఎంసీ భావిస్తోంది. కాగా ఇలా స్కైవాక్ నిర్మించడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా పలు చోట్ల ప్రయాణికుల సౌకర్యార్థం స్కైవాక్ నిర్మించారు. Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..! ప్యారడైజ్ మెట్రో స్టేషన్ ను సైతం ఇలాగే నిర్మించారు. అక్కడ సికింద్రాబాద్ పీజీ కాలేజీ వైపు నిర్మించారు. ఆ స్టేషన్ వద్ద నుంచి కిందకి వచ్చి రోడ్డు దాటాలంటే ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉండేది. దీంతో వారి ఇబ్బందిని తొలగించేందుకు జీహెచ్ ఎంసీ అక్కడ స్కైవాక్ నిర్మించింది. అలాగే ఉప్పల్ లో సైతం స్కైవాక్ నిర్మించారు. ఇప్పుడు అదే మాదిరిగా పరేడ్ గ్రౌండ్ స్టేషన్ వద్ద కూడా కొత్తగా స్కైవాక్ నిర్మించబోతున్నారు. #metro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి