కేటీఆర్‌ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు

బీఆర్‌ఎస్‌ నేతలకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో జరిగిన అక్రమాలపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update

బీఆర్‌ఎస్‌ నేతలకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ(ACB) విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో పూర్తిగా విచారణ జరిపి నిజాలను బయటకు తీయాలని ఆదేశించింది. నిందితులు ఎవరైనా కూడా వదలొద్దని ఆదేశించింది. అయితే ఈ కేసుతో లింక్ ఉన్నవారందరికీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయం తీసుకుంది.      

Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. కొత్తగా మరో స్కైవాక్, ఎక్కడంటే?

అక్రమంగా రూ.55 కోట్లు

 ఈ ఫార్ములా రేసు నిర్వహించేందుకు నిబంధనలు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అప్పగించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. కనీసం జీవో కూడా లేకుండా, నోటి మాట ద్వారా రూ.55 కోట్లు విడుదల చేయడం విమర్శలకు దారి తీసింది. దీనిపై విచారణ జరపాలని అధికారులు ఏసీబీకి లెటర్ రాశారు. దీంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. అప్పటి మున్సిపల్ శాఖ అధికారి అర్వింద్ కుమార్‌కు ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారనే చర్చ నడుస్తోంది. 

Also Read: అమెరికా ఎన్నికలు.. కమలా హారిస్ పూర్వికుల గ్రామంలో సంబరాలు

గతేడాది హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ఫార్ములా ఈ-రేస్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రేస్ కోసం దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అయితే తొలి రేస్ విజయవంతం కావడం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులతో మున్సిపల్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే రూల్స్‌కు విరుద్ధంగా రూ.55 కోట్లను  విదేశీ సంస్థకు చెల్లించింది. ఈ వ్యవహారమంతా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.    

Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. కొత్తగా మరో స్కైవాక్, ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు